సవ్యసాచి లో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్న భూమిక

Friday,December 29,2017 - 11:03 by Z_CLU

నాని MCA లో వదిన క్యారెక్టర్ లో నటించి ఇంప్రెస్ చేసిన భూమిక, ఇప్పుడు నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాలోను అదే తరహా కీ రోల్ లో లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు మ్యాగ్జిమం స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన భూమిక, ఇప్పుడు కీ రోల్స్ ప్లే చేస్తూ, అంతే బిజీగా కరియర్ ప్లాన్ చేసుకుంటుంది.

చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విలన్ గా నటిస్తున్నట్టు కన్ఫం చేసినా, ప్రస్తుతానికి భూమిక ప్లే చేస్తున్న క్యారెక్టర్ రివీల్ చేయదు. రీసెంట్ గా రిలీజైన MCA సక్సెస్ ఎఫెక్ట్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన భూమిక, సవ్యసాచిలో చేస్తున్న క్యారెక్టర్ వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాలో నాగ చైతన్య  సరసన  నిధి అగర్వాల్ నటిస్తుంది. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు.