'యూటర్న్' తీసుకున్న భూమిక

Friday,April 13,2018 - 02:15 by Z_CLU

సెకెండ్ ఇన్నింగ్స్ లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న భూమిక, ఇప్పుడు మరో సినిమా సెట్స్ పై జాయిన్ అయింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యు-టర్న్ సినిమాలో ఓ కీలక పాత్రకు భూమిక ఎంపికైన విషయం తెలిసిందే. ఆ సినిమా సెకెండ్ షెడ్యూల్ లో భూమిక జాయిన్ అయింది. ఈ సందర్భంగా సమంత, భూమికతో కలిసి యూనిట్ సభ్యులంతా కలిసి దిగిన గ్రూప్ సెల్ఫీని మీడియాకు షేర్ చేశారు.

ఒక ఫ్లై ఓవర్ మీద చనిపోతున్న మోటార్ సైకిల్ రైడర్ల కేస్ ను ఛేదించే ఓ జర్నలిస్ట్ కథే “యు టర్న్”. సమంత ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటోంది యూనిట్. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం భూమిక ఈ సినిమాలో దెయ్యంగా కనిపించబోతోందట. పవన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.