Bhumika - మరో ఇంట్రెస్టింగ్ రోల్

Sunday,November 01,2020 - 06:23 by Z_CLU

నాలుగు పాత్ర‌ల చుట్టు న‌డిచే రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌తో ఓ సినిమా వస్తోంది. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, తాన్యా హోప్ మూడు పాత్రలకు ఎంపికయ్యారు. షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పుడు నాలుగో పాత్ర కోసం భూమికను తీసుకున్నారు.

Bhumika road movie

లాక్‌డౌన్ త‌ర్వాత మళ్లీ మొదలైన షూటింగ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. గురుప‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమా ఈ నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు.

Bhumika on bike

లాక్‌డౌన్‌కు ముందుగానే ల‌డ‌ఖ్ షెడ్యూల్‌తో స‌హా 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో అన్ని ర‌కాల నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌రుగుతోంది. న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.