నాని సినిమాలో భూమిక...

Saturday,June 17,2017 - 03:41 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలుచేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్న నేచురల్ స్టార్ ప్రస్తుతం నిన్ను కోరి సినిమాను ఫినిషింగ్ స్టేజీ కి తీసుకొచ్చిన నాని మరో వైపు దిల్ రాజు నిర్మాణం లో వేణు శ్రీరామ్ డైరెక్షన్లో  MCA సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ అబ్బాయి అనే క్యాప్షన్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ భూమిక ఓ మెయిన్ రోల్ నటించనుందనే వార్త వినిపిస్తుంది.

ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సినిమాలోని ఓ ఇంపార్టెంట్ మెయిన్ రోల్ కోసం  భూమిక ను సంప్రదించారట. అప్పట్లో ఆల్మోస్ట్  స్టార్ట్ హీరోలందరితో హీరోయిన్ గా నటించిన భూమిక ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని భావించిన మేకర్స్ ఇటీవలే ఈ సీనియర్ హీరోయిన్ ను కలిసి క్యారెక్టర్ తో పాటు కథ కూడా వినిపించారట. ఈ రోల్ భూమిక కి బాగా నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా సెట్ లోకి నటి గా ఎంట్రీ ఇవ్వనుందని, నాని తో కలిసి నటించనుందని ఇంసైడ్ టాక్. మరి ఈ సినిమాలో భూమిక ఎలా కనిపిస్తుందో..నాని తో కలిసి ఎలా ఎంటర్టైన్ చేస్తుందో..చూడాలి.