భూమిక చావ్లా ఇంటర్వ్యూ

Friday,December 29,2017 - 03:28 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన MCA సినిమాలో నానికి వదినగా నటించి ఇంప్రెస్ చేసింది భూమిక. ఈ సినిమా తరవాత  సవ్యసాచి సినిమాలోను గెస్ట్ రోల్ లో కనిపించనున్న భూమిక, తన కరియర్ ని, ఫ్యూచర్ లో చేయబోయే క్యారెక్టర్స్ ని ఆల్ రెడీ ప్లాన్ చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీకోసం…

చాలా హ్యాప్పీ…

2013 తరవాత మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. ఇన్ని రోజుల గ్యాప్ తరవాత ఇంత మంచి క్యారెక్టర్ చేయడం నిజంగా చాలా హ్యాప్పీగా ఉంది. నానికి వదినగా, ఆఫీసర్ గా చాలా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్.

 

అసలు సంబంధం ఉండదు…

రియల్ లైఫ్ లో నాకిలాంటి ఎక్స్ పీరియన్సెస్ లేవు. కానీ నా ఫ్రెండ్ సర్కిల్ లో ఇలాంటి వదిన మరుదులని చూశాను… ఈ సినిమాకి ఓకె చెప్పాక అబ్జర్వ్ కూడా చేశాను..

అలా అయితేనే చేస్తా…

ఫ్యూచర్ లో కూడా సపోర్టింగ్ రోల్ చేస్తాను కానీ చేసే క్యారెక్టర్ ఏదైనా పవర్ ఫుల్ గా ఉంటేనే చేస్తాను. నాగచైతన్య ‘సవ్యసాచి’ లో గెస్ట్ రోల్ చేశాను. స్క్రీన్ పై చాలా తక్కువగా ఉంటాను. కానీ స్టోరీ మూమెంట్ నేను చేసిన క్యారెక్టర్ తో బిగిన్ అవుతుంది. నాగచైతన్య కి అక్కగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించాను.

అఖిల్ తో కూడా చేస్తాను…

సుమంత్ తో నాగార్జున గారితో ఆల్ రెడీ సినిమాలు చేసేశాను.  ఇపుడు ‘సవ్యసాచి’లో నాగచైతన్య తో కూడా కలిసి నటించాను. మంచి స్క్రిప్ట్ దొరికితే డెఫ్ఫినేట్ గా అఖిల్ తో కూడా నటిస్తాను.

డ్రీమ్ రోల్…

ఇలాంటి రోల్ చేస్తే బావుంటుంది అని పర్టికులర్ గా అనుకోలేదు కానీ చేసే ప్రతి సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. MCA లో వదినగా చేశాను. ఇంకో సినిమాలో మరో డిఫెరెంట్ పవర్ ఫుల్ రోల్, ప్రతిసారి  ఆడియెన్స్ కి కొత్తగా అనిపించే రోల్ లో చేయాలని ఉంటుంది.

హారర్ సినిమాలు ఇష్టం ఉండదు…

హారర్ సినిమాల్లో అస్సలు నటించను. సైకలాజికల్ గా డిస్టబ్ చేసే సినిమాలు చూడటం అంటే నాకు భయం. అందుకే అలాంటి సినిమాలు చూడను. చేయను.

సంతృప్తినిచ్చిన సినిమాలు…

అనసూయ, మిస్సమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా క్యారెక్టర్ అని కాకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉన్న ప్రతి సినిమా సంతృప్తినిస్తుంది.

 

చిరంజీవి గారితో కూడా చేస్తాను…

హీరోయిన్ గా చిరంజీవి గారితో కూడా నటించాను. ఇప్పుడు కూడా మంచి క్యారెక్టర్, స్క్రిప్ట్ దొరికితే మళ్ళీ నటిస్తాను.

తనుంటే సెట్ లో ఎనర్జీ ఉంటుంది…

సాయి పల్లవి చాలా ఆక్టివ్ గా ఉంటుంది. తను సెట్స్ కి వచ్చిందంటే ఎనర్జీ వచ్చేస్తుంది. గతంలో హీరోయిన్స్ కి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకు కూడా తెలిసేది కాదు.. కానీ సాయి పల్లవి అలా కాదు. తన కరియర్ విషయంలో కానీ, సినిమా విషయంలో చాలా క్లారిటీ గా ఉంటుంది.

డబ్బింగ్ చెప్తున్నాను…

సవ్యసాచి సినిమాలో నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటున్నాను. నాకు తెలుగు మాట్లాడేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ జరుగుతాయని కొంచెం భయంగా ఉంటుంది అంతే… MCA కి కూడా చెప్పి ఉంటే బావుండేదని ఫీలింగ్…

అది మాత్రం కన్ఫం…

తమిళంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాను. ఎలాంటి క్యారెక్టర్ చేసినా నేను డిఫెరెంట్ గా కనిపించడం మాత్రం కంపల్సరీ.

దిల్ రాజు గారు ది బెస్ట్…

ఇప్పటి వరకు నేను పని చేసిన ప్రతి ప్రొడక్షన్ హౌజ్ చాలా బావుంది. కానీ 3 ఏళ్ల గ్యాప్ తరవాత తెలుగులో MCA చేశాను. కానీ దిల్ రాజు గారు కానీ ఆయన టీమ్ కానీ అలా ఫీల్ అవనివ్వలేదు. దిల్ రాజు గారు సినిమా గురించి చాలా కేర్ తీసుకుంటారు. అందుకే ఆయన కంటిన్యూస్ సక్సెస్ ని చూస్తున్నారు.