బాలయ్య సినిమాలో లేడీ విలన్

Sunday,April 12,2020 - 12:01 by Z_CLU

బాలయ్య సినిమాలో విలన్ అంటే భయంకరంగా ఉంటాడు. విలనిజం ఆ రేంజ్ లో పండుతుంది కాబట్టే బాలయ్యలో హీరోయిజం అదే రేంజ్ లో ఎలివేట్ అవుతుంది. ఇక బోయపాటి-బాలయ్య సినిమాల్లో విలన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. జగపతిబాబు లాంటి ఫ్యామిలీ హీరోనే అరివీర భయంకరమైన విలన్ గా చూపించాడు బోయపాటి. అలాంటిది ఇప్పుడు బాలయ్య-బోయపాటి సినిమాలో ఓ లేడీ విలన్ ఉండబోతోందట.

అవును.. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం.. బాలయ్య-బోయపాటి సినిమాలో లేడీ విలన్ గా భూమికను తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇంతవరకు ఓకే కానీ, బాలయ్యకు లేడీ విలన్ ఏంటనేది ఓ ప్రశ్న. దీనికితోడు మొన్ననే బాలయ్య నటించిన రూలర్ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది. అంతలోనే ఈ సినిమాలో లేడీ విలన్ అనే ప్రచారం నమ్మదగేలా లేదు.

అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. బాలయ్య-బోయపాటి సినిమాలో భూమిక మెయిన్ విలన్ కాదట. నమ్మించి మోసం చేసే నెగెటివ్ పాత్రలో ఆమె కనిపించనుందని తెలుస్తోంది. భూమిక పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాన్ని పక్కనపెడితే, బాలయ్య-బోయపాటి సినిమాలో భూమిక ఉందనేది మాత్రం ఈ రూమర్ ద్వారా నిజమైంది.