బాలీవుడ్ కి 'భాగమతి'

Friday,October 18,2019 - 12:04 by Z_CLU

ప్రస్తుతం బాలీవుడ్ లో తెలుగు సినిమాలు వరుసగా రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడా లిస్టులోకి మరో సినిమా చేరింది. అశోక్ డైరెక్షన్ లో అనుష్క నటించిన ‘భాగమతి’ గతేడాది విడుదలై సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ లోని ఓ బడా సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది.

అనుష్క రోల్ ను హిందీలో భూమి పెండ్నేకర్ చేయనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుండి షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది మేలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.