భేతాళుడు బాక్సాఫీస్ హంట్ మొదలైంది..

Friday,December 02,2016 - 09:30 by Z_CLU

`బిచ్చ‌గాడు` అనంతరం విజ‌య్ ఆంటోని న‌టించిన `భేతాళుడు` కోసం తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు, అటు కామ‌న్ జ‌నాల్లోనూ అత‌డి సినిమాపై ఒక‌టే క్యూరియాసిటీ. అనుకున్న‌ట్టే భేతాళుడు మూవీ దాదాపు 500 థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజైంది. డిసెంబ‌ర్ 1 రిలీజ్‌కి ముందే `సైతాన్ హంట్స్ ఫ‌ర్ జ‌య‌ల‌క్ష్మి` అంటూ యూనిట్ రిలీజ్ చేసిన వీడియో భేతాళుడిపై మ‌రింత ఆస‌క్తి రేకెత్తించింది. 10 నిమిషాల ఈ వీడియో భారీ ప్రచారం తెచ్చిపెట్టింది. నిన్న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. బిచ్చగాడు బ్రహ్మాండమైన విజయం సాధించడంతో… ఆ ఎఫెక్ట్ భేతాాళుడు ఓపెనింగ్స్ పై స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు విజయ్ ఆంటోనీ పెర్ఫామెన్స్ ఇరగదీశాడన్న టాక్ సినిమాకు పిల్లర్ గా నిలిచింది.

కంటెంటే బ‌లంగా తెర‌కెక్కిన‌ `భేతాళుడు` చిత్రానికి విజ‌య్ ఆంటోని అందించిన రీరికార్డింగ్ ప్ర‌ధాన ఆయుధం. అలాగే ఈ సినిమాలో సినిమాటోగ్ర‌ఫీ…. సీన్ మూడ్ క్యారీ చేయ‌డంలో ది బెస్ట్ అనిపించింది. క‌రెన్సీ క్రైసిస్‌ని సైతం తట్టుకొని భేతాళుడు నిలబడ్డం నిజంగా గొప్ప విషయం. కొత్తదనం అనే పదానికి కేరాఫ్ గా నిలిచిన విజ‌య్ ఆంటోని… భేతాాళుడుతో ఆ ఇమేజ్ ను డబుల్ చేసుకున్నాడు.