'భీష్మ' టీజర్: రొమాంటిక్ జోడీ

Monday,January 13,2020 - 10:02 by Z_CLU

నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

భీష్మ పాత్రలో నితిన్ మరోసారి రొమాంటిక్ గా, ఎనర్జిటిక్ గా కనిపించాడు. అతడి లుక్, డైలాగ్స్ బాగున్నాయి. రష్మికను టీజర్ లో చాలా క్యూట్ గా ప్రజెంట్ చేశారు. నితిన్-రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. మరీ ముఖ్యంగా టీజర్ లో డైలాగ్స్ ట్రెండీగా చాలా బాగున్నాయి.

మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి వస్తోంది భీష్మ.

నటీనటులు :
నితిన్,రష్మిక మండన, నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, తదితరులు
మ్యూజిక్ : మహతి స్వర సాగర్
డి .ఓ .పి : సాయి శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్
ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ )
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల