భీష్మ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,February 24,2020 - 11:25 by Z_CLU

మొదటి రోజే హిట్ టాక్ వచ్చింది. ఇక ఓపెనింగ్స్ పరంగా నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సో.. మరో 5 రోజుల్లో బ్రేక్-ఈవెన్ అవుతుందని ట్రేడ్ ఎక్స్ పెక్ట్ చేసింది. కానీ భీష్మ సినిమా ఈరోజు లేదా రేపటికే బ్రేక్-ఈవెన్ అయ్యేలా ఉంది.

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు 3 రోజుల్లో 14 కోట్ల 89 లక్షల రూపాయల షేర్ వచ్చింది. హైలెట్ ఏంటంటే.. నైజాంలో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అయిపోయింది. ఐదున్నర కోట్ల NRA (నాన్-రికవరబుల్ అడ్వాన్స్) మీద దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేస్తే, 3 రోజులకే 5 కోట్ల 93 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిన భీష్మ.. ఉత్తరాంధ్ర, కృష్ణ, గుంటూరులో బ్రేక్-ఈవెన్ కు చాలా దగ్గరగా వచ్చేసింది. ఎంతలా అంటే, ఈరోజు లేదా రేపటికి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ప్రస్తుతం నడుస్తున్న రెవెన్యూ ట్రెండ్స్ చూస్తుంటే.. ఈ వీకెండ్ నాటికి ఓవర్సీస్ తో పాటు ఏపీ,నైజాంలోని బయ్యర్లంతా లాభాలు అందుకోవడం గ్యారెంటీ.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 5.93 కోట్లు
సీడెడ్ – రూ. 2.24 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.79 కోట్లు
ఈస్ట్ – రూ. 1.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.88 కోట్లు
గుంటూరు – రూ. 1.37 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు
కృష్ణా – రూ. 0.92 కోట్లు