Bheemla Nayak ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే ?

Saturday,February 19,2022 - 05:12 by Z_CLU

Bheemla Nayak Trailer release details

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ ఈ నెల 25 థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చి డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్.

BheemlaNayak-trailer-pawan-kalyan-rana-daggubati-rana-zeecinemalupawan kalyan

ఫిబ్రవరి 21న ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు న్యూ పోస్టర్ తో తెలియజేశారు. ఇక అదే రోజు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి రాజకీయ , సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా డైనమిక్ లీడర్ కె.టి.ఆర్ గారిని ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఇన్వైట్ చేశారు. అలాగే మరో ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రానున్నారు.

యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి భారీ సంఖ్యలో పవన్ అభిమానులు వస్తున్నారు. అయితే ట్రైలర్ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారా ? లేదంటే ఈవెంట్ కంటే ముందే సోషల్ మీడియాలో వదులుతారా ? అనేది తెలియాల్సి ఉంది. ఇటివలే సినిమాకు సంబంధించి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుండి U/A అందుకున్న ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. రేపటి నుండే పవర్ స్టార్ మేనియా స్టార్ట్ అవ్వనుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics