Bheemla Nayak ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్

Monday,February 21,2022 - 12:50 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్‘ ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి డైనమిక్ లీడర్  కే.టి.ఆర్ గారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశారు. అక్కడే ట్రైలర్ రిలీజ్ కూడా ప్లాన్ చేశారు. కానీ ఉన్నపళంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ హఠాన్మరణంతో ఈవెంట్ ని వాయిదా వేసుకున్నారు.

 ” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలీలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేయాలని నిర్ణయించాం.  ఈ వేడుక త్వరలోనే జరగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుంది” అంటూ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు పవన్ కళ్యాణ్.

మేకర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి మరణం పట్ల నివాళి ఘటించారు. త్వరలోనే ఈ వేడుక మళ్ళీ అనుకున్నట్లుగానే జరగనుంది. రేపు ఈ ఈవెంట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics