పెళ్ళికి రెడీ అవుతున్న భావన...

Thursday,May 04,2017 - 04:01 by Z_CLU

హీరోయిన్ భావన పెళ్ళికి రెడీ అవుతుంది.. ఇటీవలే ఓ వివాదంతో వార్తల్లోకెక్కిన ఈ అమ్మడు ప్రెజెంట్ నటి గా కెరీర్ పై ఫోకస్ తగ్గించి పెళ్లి చేసుకోబుతుంది… ఇటీవలే ఈ భామ కు ప్రముఖ నిర్మాత నవీన్ తో కొచ్చి లో భావన రెసిడెన్సీ లో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే…

లేటెస్ట్ గా భావన తల్లి పుష్ప తన కుమార్తె పెళ్లి పై స్పందించారు. ప్రెజెంట్ స్విట్జర్లాండ్ వెకేషన్ లో ఉన్న భావన అక్టోబర్ 27 పెళ్లి పీటలెక్కనుందని.. భావన స్విట్జర్లాండ్ నుంచి రాగానే పెళ్లి ఎక్కడనేది ఎవరెవరిని ఆహ్వానించబోతున్నామనేది డిసైడ్ చేయబోతున్నామని తెలిపింది.. సో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న భావన మరో 5 నెలల్లో పెళ్లి పీటలెక్కనుందన్నమాట…