భరత్ అనే నేను: 3 వారాల్లో 205 కోట్లు

Friday,May 11,2018 - 05:02 by Z_CLU

మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా సరికొత్త సంచలనం సృష్టించింది. నిన్నటితో విడుదలై 3 వారాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 205 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ మేరకు అఫీషియల్ గా వివరాలు ప్రకటించారు మేకర్స్. కైరా అద్వానీ హీరోయిన్ గా నిటంచిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

ఏపీ, నైజాం 21 రోజుల షేర్

 

నైజాం – రూ. 20.18 కోట్లు

సీడెడ్ – రూ. 9.80 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 9.10 కోట్లు

ఈస్ట్ – రూ. 6.86 కోట్లు

వెస్ట్ – రూ. 4.10 కోట్లు

గుంటూరు – రూ. 8.10 కోట్లు

కృష్ణా – రూ. 5.65 కోట్లు

నెల్లూరు – రూ. 2.06 కోట్లు