త్వరలో ‘భరత్ అనే నేను’ సీక్వెల్

Monday,April 23,2018 - 01:23 by Z_CLU

ఓ వైపు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా సీక్వెల్ తీసే ఆలోచనలో పడ్డాడు. ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పుకున్నాడు ఈ కమర్షియల్ డైరెక్టర్.

“నా అభిప్రాయం ప్రకారం ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ‘భరత్ అనే నేను’ లో చాలా వరకు అలాంటి పాయింట్స్ నే డిస్కస్ చేశాం. ఈ సినిమాలో భరత్ క్యారెక్టర్ ప్రజలకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్న ప్రతి పాలిటీషియన్ ని రిప్రెజెంట్ చేస్తుంది” అని చెప్పుకున్నాడు కొరటాల శివ.

‘భరత్ అనే నేను’ సీక్వెల్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలీదు  కానీ, ఈ సినిమా గనక సెట్స్ పైకి వస్తే CM గా చార్జ్ తీసుకున్న భరత్, ఆ తరవాత ఎటువంటి సమస్యలపై  ఫోకస్ చేశాడు. ఆ ప్రాసెస్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి..? వాటిని ఎలా సాల్వ్ చేశాడు..? లాంటి పాయింట్స్ పై సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా కొరటాల మైండ్ లో ఉన్న ఈ సీక్వెల్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.