భైర‌వగీత చిత్రం సెన్సార్ పూర్తి.. డిసెంబ‌ర్ 14న విడుద‌ల‌

Tuesday,December 11,2018 - 10:01 by Z_CLU

భైర‌వ‌గీత సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిశాయి. సెన్సార్ బోర్డ్ A స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ రాయ‌లసీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని 23 ఏళ్ల కొత్త ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించాడు.

ఈ చిత్ర ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.. అన్ని వ‌ర్గాల నుంచి దీనికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ర‌విశంక‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం విశేషం.

అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా, భాస్క‌ర్ రిషి నిర్మించిన ఈ సినిమాను, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా (డిసెంబ‌ర్ 14న) విడుదల చేయబోతున్నారు.

న‌టీన‌టులు: ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్..
ద‌ర్శ‌కుడు: సిద్ధార్థ్ తాతోలు
నిర్మాత‌లు: అభిషేక్ నామా మ‌రియు భాస్క‌ర్ రిషి
నిర్మాణ సంస్థ‌: అభిషేక్ పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌కులు: రామ్ గోపాల్ వ‌ర్మ
సంగీత ద‌ర్శ‌కుడు: ర‌వి శంక‌ర్
సాహిత్యం: సిరా శ్రీ‌
క‌థ‌, స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వ‌ర్మ/ రామ్ వంశీ కృష్ణ
సినిమాటోగ్ర‌ఫర్: జ‌గ‌దీష్ చీక‌టి M.F.A