`భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు` ట్రైల‌ర్ రివ్యూ

Wednesday,November 20,2019 - 07:17 by Z_CLU

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగా హీరో వ‌రుణ్‌ తేజ్ విడుద‌ల చేశాడు.

కమెడియన్లు అంతా కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అందరి దృష్టి పడింది. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్ లో పంచ్ లు బాగా పేలాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా ట్రెండ్స్, పాలిటిక్స్ ను బేస్ చేసుకొని పేల్చిన పంచ్ లు బాగున్నాయి. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ తమ మార్క్ చూపించారు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించారు.