సంక్రాంతి బరిలో అనుష్క ?
Saturday,September 30,2017 - 11:50 by Z_CLU
ప్రస్తుతం సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమాతో పాటు బాలయ్య- కె.ఎస్.రవి కుమార్ సినిమా కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలోకి స్టార్ హీరోయిన్ అనుష్క కూడా రానుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భాగమతి’ అనే సినిమా చేస్తున్న అనుష్క ఈ సినిమాతో సంక్రాంతి బరిలో ఎంట్రీ ఇవ్వబోతుందట.
యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై చారిత్రక నేపధ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ కీ రోల్ లో నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నవంబర్ లో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సంక్రాంతి కి సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట మేకర్స్. మరి ‘అరుంధతి’ తో సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుష్క ‘భాగమతి’ తో సోలోగా మళ్ళీ ఎలాంటి హిట్ సాదిస్తుందో.. చూడాలి.