అనుష్క 'భాగమతి' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయింది

Tuesday,January 16,2018 - 12:49 by Z_CLU

జనవరి 26 నుండి థియేటర్స్ లో థ్రిల్ చేయనుంది అనుష్క భాగమతి. రీసెంట్ గా అవుట్ స్టాండింగ్ టీజర్ తో ఇంప్రెస్ చేసిన టీమ్, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసింది. అల్టిమేట్ హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోని త్వరలో రిలీజ్ చేయనుంది మూవీ టీమ్.

రేపు  చెన్నై లో  గ్రాండ్ గా   తమిళ  ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న  సినిమా యూనిట్,  20  లేదా 21  న తెలుగులోను  అంతే గ్రాండ్  గా ఆడియో లాంచ్ జరుపుకోనుంది. ఈ ఈవెంట్  కి టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.

UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాకి G. అశోక్ డైరెక్టర్.