మరికొన్ని గంటల్లో భాగమతి ఫస్ట్ లుక్

Monday,November 06,2017 - 10:54 by Z_CLU

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటిస్తున్న తాజా చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో… భాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది. భాగమతి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు విడుదల చేయనుంది.

పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. బంపర్ హిట్ చిత్రాల్ని నిర్మించి…. రెబల్ స్టార్ ప్రభాస్ తో నాలుగు భాషల్లో సాహో వంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ కలిసి భాగమతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు ప్రమోద్, వంశీ తెలియజేశారు.

నటీనటులు – అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్
సంగీతం – ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్ – మథి
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావ్
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్
నిర్మాతలు – వంశీ – ప్రమోద్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – అశోక్