భాగమతి సెన్సార్ కంప్లీట్

Thursday,January 18,2018 - 06:00 by Z_CLU

చాన్నాళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా భాగమతి. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి 142 నిమిషాలుంది. అంటే 2 గంటల 22 నిమిషాలన్నమాట.

బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇదే. అశోక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆది పినిశెట్టి ఇందులో విలన్ గా నటించాడు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆది విలన్ గా కనిపిస్తాడు. మూవీలో అనుష్క తర్వాత ఆది పినిశెట్టి పాత్రే హైలెట్ అని టాక్.

భాగమతి ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా తమిళ వెర్షన్ సాంగ్స్ ను చెన్నైలో విడుదల చేశారు. హీరో సూర్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. త్వరలోనే తెలుగులో భాగమతి ప్రచారం ప్రారంభం అవుతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.