భాగమతి ఫస్ట్ లుక్ రిలీజ్

Monday,November 06,2017 - 06:16 by Z_CLU

అనుష్క లీడ్ రోల్ లో నటించిన భాగమతి సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. రేపు అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా భాగమతి మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజైంది భాగమతి ఫస్ట్ లుక్.

 

బాహుబలి-2 తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇదే. మథి కెమెరా వర్క్, ఆర్ట్ డైరక్టర్ రవీందర్ వేసిన సెట్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.