సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘భాగమతి’ ట్రైలర్

Monday,January 08,2018 - 07:15 by Z_CLU

అనుష్క లీడ్ రోల్ ప్లే చేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘భాగమతి’ ట్రైలర్ రిలీజయింది. రీసెంట్ గా టీజర్ తో ఈ సినిమాపై ఇంటరెస్ట్ ని జెనెరేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్ తో మూవీ స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేశారు. రిలీజైన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని క్రాస్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

 

ట్రైలర్ లో అనుష్క పర్ఫామెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని దాటేసింది. అనుష్కని IAS ఆఫీసర్ లా, భాగమతిలా రెండు డిఫెరెంట్ షేడ్స్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ ట్రైలర్, సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. హారర్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో ఇంటర్నల్ గా ఉండే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాకి మరింత హైప్ ని ఆడ్ చేస్తుంది.

తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా జనవరరి 26 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా అశోక్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.