‘భాగమతి’ ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర ఇంటర్వ్యూ

Tuesday,January 23,2018 - 02:46 by Z_CLU

అనుష్క ‘భాగమతి’ జనవరి 26 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రమోషన్ ప్రాసెస్ ని బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర ఈ సినిమాలో వేసిన బంగ్లా సెట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవి మీకోసం…

భాగమతి సినిమా….

భాగమతి కంప్లీట్ హారర్ మూవీ కాదు. హారర్ అనేది సినిమాలో ఒక చిన్న ఎలిమెంట్ మాత్రమే. ఇక పాత బంగ్లా సెట్ విషయానికి వస్తే దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ ఆ బంగ్లాలోనే జరిగింది. 400 ఏళ్ల క్రితం నాటి బంగ్లా లుక్ లో ఉంటుంది కంప్లీట్ సెట్.

 

అలా మొదలైంది…

డైరెక్టర్ గారు స్టోరీ చెప్పాక నార్త్ కి వెళ్లి చాలా బంగ్లాలు చూశాం. కానీ ఏది స్టోరీకి మ్యాచ్ అవ్వలేదు. ఈ లోపు అనుష్క గారు డేట్స్ ఇచ్చేశారు. అప్పుడింక డెసిషన్ తీసుకోవాల్సిన టైమ్. అందుకే నేను మామూలుగా స్కెచ్ వేసి ప్రొడ్యూసర్స్ కి చూపించాను. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చీ రాగానే వర్క్ బిగిన్ చేశాం.

అలా జరిగింది….

ఇల్లు, బంగ్లా, కోట… మూడు వేర్వేరు. ఈ సినిమాలో మాకు కావాల్సింది ఇల్లు. ఒక రాజు తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చిన ఇల్లు. అది మైండ్ లో పెట్టుకుని సెట్ వేశాం.

 

ప్రతి ఒక్కరిని చాలెంజ్ చేసింది…

నేను ‘సెట్’ ప్రాసెసింగ్ లో ఉన్నప్పుడు ఎవరికీ చూపించలేదు. మహా అయితే థమన్ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాడు. అలాంటిది ఫస్ట్ డే షూటింగ్ కి వచ్చినప్పుడు సెట్ చూసి అందరూ షాకయిపోయారు. సెట్ ఈ రేంజ్ లో ఉంటే సినిమాని ఇంకెంత అద్భుతంగా తీయాలి అని.. డిస్కర్షన్స్ బిగిన్ అయిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ సెట్ ప్రతి డిపార్ట్ మెంట్ ని చాలెంజ్ చేసింది.

నేనే చాలా సార్లు భయపడ్డాను….

కంప్లీట్ గా న్యాచురల్ ఎఫెక్ట్ ఉంటుంది బంగ్లాలో… ఒక చోట వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. 400 ఏళ్లుగా అలా జరుగుతుంది కాబట్టి అక్కడ ఫంగస్ వచ్చి ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద మర్రిచెట్టు ఉంటుంది. వాటర్ లీక్ అవుతున్న సౌండ్ వస్తుంటుంది. అలాంటి చోట ఒక్కసారి డోర్స్ క్లోజ్ చేశామంటే, లోపల అసలేమీ కనిపించదు. అలాంటిది ఎవరైనా కలవడానికి వచ్చారంటే అంత పెద్ద బంగాళాలోంచి భయపడుతూ బయటికి వచ్చేవాడిని…

 

వదిలేసిన సినిమాలెన్నో….

ఒక సినిమాకు పని చేసే అవకాశం వస్తే, ఆ సినిమాకు నేను 100% చేయగలను అనిపించినప్పుడే సినిమా ఒప్పుకుంటాను లేకపోతే లేదు. అలా నేను చాలా సినిమాలు వదిలేశాను…

అందరూ కష్టపడి చేసిన సినిమా…

భాగమతి సినిమా కోసం ప్రతి డిపార్ట్ మెంట్ ఒక తాటిపై నిలబడి పని చేశాం. ప్రతీది రెడీ అయ్యాకే షూటింగ్ బిగిన్ చేసే వాళ్ళం.