భాగమతి ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Monday,January 29,2018 - 12:55 by Z_CLU

బాక్సాఫీస్ బరిలో అనుష్క మరోసారి సత్తా చాటింది. ఈమె నటించిన భాగమతి సినిమా వరల్డ్ వైడ్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా 12 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లేందుకు రెడీగా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ దర్శకుడు.

ఏపీ, నైజాం 3 రోజుల వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 4. 89 కోట్లు
సీడెడ్ – రూ. 1.65 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.47 కోట్లు
గుంటూరు – రూ. 0.96 కోట్లు
ఈస్ట్ – రూ.0.95 కోట్లు
వెస్ట్ – రూ. 0.65 కోట్లు
కృష్ణా – రూ. 0.91 కోట్లు
నెల్లూరు – రూ. 0.54 కోట్లు

మొత్తం షేర్ – రూ. 12.02 కోట్లు