డిసెంబర్ 1న భేతాళుడు రిలీజ్

Monday,November 21,2016 - 05:40 by Z_CLU

టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటి భేతాళుడు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పెద్ద నోట్ల రద్దు కారణంగా అనూహ్యంగా వాయిదాపడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ కన్ ఫం చేశారు. డిసెంబర్ 1న భేతాళుడు సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన సినిమా కావడంతో.. భేతాళుడుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు తొలి 10నిమిషాల సినిమాను ముందుగానే యూట్యూబ్ లో విడుదల చేసి, సరికొత్త ప్రచారం స్టార్ట్ చేశాడు విజయ్ ఆంటోనీ. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.