రేపే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

Wednesday,November 30,2016 - 08:43 by Z_CLU

బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా స్టార్ డం తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ హీరో లేటెస్ట్ మూవీ భేతాళుడిపై ప్రస్తుతం చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా భారీ అంచనాల మధ్య భేతాళుడు సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు విజయ్ ఆంటోనీ.
bethaludu-2
విడుదలకు ముందే 10 నిమిషాల సినిమాను నెట్ లో విడుదల చేసి సంచలనం సృష్టించాడు విజయ్ ఆంటోనీ. టైటిల్స్ నుంచి ప్రారంభమై 10నిమిషాల తర్వాత సినిమా ఆగిపోతుంది. ఆ 10నిమిషాల సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు, కచ్చితంగా మిగతా సినిమా చూసేందుకు థియేటర్ కు పరిగెడతాడు. అంతలా భేతాళుడు మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రదీప్ కృష్ణమూర్తి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అరుంధతి నాయర్ హీరోయిన్ గా నటించింది.