బెస్ట్ హీరో - 2016

Saturday,December 31,2016 - 09:01 by Z_CLU

ప్రతి సంవత్సరంలాగే 2016లో కూడా చాలా రిజల్యూషన్స్ వచ్చాయి. టాలీవుడ్ హీరోలకు బోలెడన్నీ ఛాలెంజెస్ తో పాటు బెస్ట్ హీరోస్ అనిపించుకునే అవకాశం కూడా వచ్చింది. సబ్జెక్ట్ సెలెక్షన్ దగ్గరి నుండి సినిమా హిట్ అయ్యే వరకు ఫుల్లీ ఫోకస్డ్ గా ఉన్న మన టాలీవుడ్ హీరోల్లో చాలా మంది బెస్ట్ హీరో ట్యాగ్ కి క్వాలిఫై అయ్యారు.

ntr-2016-best-hero-zee-cinemalu

NTR: 2016 ని జూనియర్ NTR బోలెడంత ప్రేమతో మొదలుపెట్టాడు. అంతే ప్రేమతో ముగించాడు. నాన్నకు ప్రేమతో లాంటి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తో ఇయర్ ని బిగిన్ చేసిన తారక్, మొక్కల్ని ప్రేమించే యంగ్ మ్యాన్ లా జనతా గ్యారేజ్ లో కనిపించి, రెండు బ్లాక్ బస్టర్స్ ని బ్యాగ్ లో వేసుకుని బెస్ట్ హీరో క్యాటగిరీ కి క్వాలిఫై అయ్యాడు.

Allu Arjun Latest Photo Shoot New HD Photos Stylish Star ULTRA HD Images, Bunny Pics, Gallery

అల్లు అర్జున్ : టాలీవుడ్ కే కాదు ఏకంగా మొత్తం సౌత్ ఇండియన్ సినిమా స్క్రీన్ కే సరైనోడు అనిపించుకున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ తో కెరరీ లోనే హయ్యస్ట్ వసూళ్లు అందుకున్నాడు బన్నీ.

ram-charan-2016-best-hero-zee-cinemalu

రామ్ చరణ్ : తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ గా ‘ధృవ’ ని అనౌన్స్ చేసినప్పుడు న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ సెట్ అయ్యాయి. కానీ ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి, రామ్ చరణ్ గత సినిమాలకి సంబంధం లేకుండా తెరకెక్కిన ‘ధృవ’… మెగా స్టామినాని వరల్డ్ వైడ్ గా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయింది. ధృవతో 2016 బెస్ట్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు చరణ్.

nithin-best-hero-2016-zee-cinemalu

నితిన్ : అప్పటి వరకు లవర్ బాయ్ గా సక్సెస్ ఫుల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న నితిన్, అ…ఆ.. సినిమాతో ఏకంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఫేవరేట్ హీరో అనిపించుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో నితిన్, బెస్ట్ హీరోగా భారీ స్కోర్ నే కలెక్ట్ చేశాడు.

nagarjuna-2016-best-hero-zee-cinemalu

నాగార్జున : 2016 ఎండింగ్ లో స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించిన నాగ్, 100 కి 100 మార్కులు సాధించిన సినిమా ‘ఊపిరి’. ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ హీరో అయినప్పటికీ ఊపిరిలో నాగార్జున పర్ఫామెన్స్ ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేలా చేసింది. సో.. ఈ సారి కూడా బెస్ట్ హీరో ట్యాగ్ ని మిస్ కాలేదు నాగ్.

ram-2016-best-hero-zee-cinemalu

రామ్ : రామ్ కరియర్ లో 2016 మాత్రం సూపర్ స్పెషల్ ఇయర్ గా నిలిచింది. ‘నేను శైలజ’ లాంటి డీసెంట్ హిట్ తో ఫ్యాన్స్ కి మరింత క్లోజ్ అయిన రామ్, హైపర్ తో హండ్రెడ్ పర్సంట్ బెస్ట్ హీరో అనిపించుకున్నాడు.

Pawan Kalyan in Sardaar Gabbar Singh New Stills

పవన్ కళ్యాణ్ :  2016 లో సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తో సరిపెట్టుకున్న పవర్ స్టార్, అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని జెనెరేట్ చేయడంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫ్యాన్స్ డిమాండ్ చేయాలే కానీ, క్యారెక్టర్ ఎలాంటిదైనా ఇరగదీసేయగలను అని ప్రూవ్ చేసిన పవర్ స్టార్ 2016 లోను బెస్ట్ హీరోగా ప్లేస్ ని సెక్యూర్డ్ చేసుకున్నాడు.

mahesh-babu-2016-best-heroes-zee-cinemalu

మహేష్ బాబు : టాలీవుడ్ లో ఎన్ని కుటుంబ కథా చిత్రాలు వచ్చినా, బ్రహ్మోత్సవం సినిమాది స్పెషల్ ప్లేస్. రీసెంట్ సినిమాల్లో ఆ రేంజ్ కాస్టింగ్ తో సినిమాలు తెరకెక్కడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి రేర్ పీస్ ని తెలుగు సినిమా ఫ్యాన్స్ కి అందించిన మహేష్ బాబు బెస్ట్ హీరో గా బెస్ట్ ప్లేస్ ని దక్కించుకున్నాడు.

nanis-2016-best-hero-zee-cinemalu

నాని : క్రిష్ణగాడి వీరప్రేమ గాథ తో స్టార్ట్ అయిన నాని 2016 జర్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ ఫాస్ట్ గా సాగింది. ఆ తరవాత వచ్చిన జెంటిల్ మెన్, మజ్ను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో, సూపర్ ఫాస్ట్ పేజ్ తో బెస్ట్ హీరోగా న్యాచురల్ గానే బెస్ట్ హీరో ప్లేస్ ని ఫిక్స్ చేసుకున్నాడు నాని.

naga-chaitanya-2016-best-hero-zee-cinemalu

నాగచైతన్య : 2016 బిగిన్ అయినప్పటి నుండి దాదాపు క్లోజ్ అయ్యే వరకు చైతు ట్రెండింగ్ పేజ్ లోనే ఉన్నాడు. ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చైతు, సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో యాక్షన్ ట్యాగ్ ని కూడా ఎటాచ్ చేసుకున్నాడు.

venkatesh-2016-best-hero-zee-cinemalu

వెంకటేష్ : ‘బాబు బంగారం’ సినిమాతో కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేసుకున్న వెంకీ, ఒక్క సినిమాతోనే మ్యాగ్జిమం అన్ని క్యాటగిరీ ఆడియెన్స్ ని ఒకే థియటర్ కి లాక్కొచ్చేశాడు. మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ తో బిగినింగ్ లో బెస్ట్ హీరో ప్లేట్ ని రెడీ చేయించుకున్నాడు.

sai-dharam-2016-best-hero-zee-cinemalu

సాయి ధరం తేజ్ : 2016 ని ‘సుప్రీమ్’ తో మొదలుపెట్టి ‘తిక్క’తో క్లోజ్ చేశాడు. మ్యాగ్జిమం మాస్ ఎంటర్ టైనర్స్ ని ఫిక్స్ చేసుకున్న సాయి ధరం తేజ్ ఇయర్ బిగినింగ్ లోనే సుప్రీమ్ తో ది బెస్ట్ అనిపించుకున్నాడు.

sharwanand-best-hero-2016-zee-cinemalu

శర్వానంద్ : 2016 ని ఎక్స్ ప్రెస్ స్పీడ్ తో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతో బిగిన్ చేసిన శర్వానంద్, సెకండాఫ్ లో రిలీజ్ అయిన రాజాధిరాజా సినిమాతో సేఫ్ జోన్ లో ఉంటూనే బెస్ట్ హీరో కి క్వాలిఫై అయ్యాడు.

naga_shourya-2016-best-hero-zee-cinemalu

నాగశౌర్య : 2016 బిగినింగ్ లోనే కళ్యాణ వైభోగమే లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో స్టార్ట్ అయిన నాగశౌర్య, ‘ఒకే మనసు’ లాంటి డీసెంట్ ఎంటర్ టైనర్ తో, మ్యాగ్జిమం ఆడియెన్స్ ని రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తరవాత జ్యో అచ్యుతానంద సినిమాతో బెస్ట్ పర్ ఫార్మర్ అనిపించుకున్నాడు.

kalyan-ram-2016-best-hero-zee-cinemalu

కళ్యాణ్ రామ్ : 2016 లో జస్ట్ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఇజం’ సినిమా చేసి పెద్ద సాహసమే చేశాడు. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు.