ట్రాక్ మార్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్

Thursday,May 09,2019 - 04:04 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ ఆలోచన మార్చుకున్నాడు. మొన్నటి వరకు జస్ట్ కమర్షియల్ వ్యాల్యూస్, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేసేవాడు. కానీ ‘కవచం’ తరవాత ట్రాక్ మార్చాడు. పెద్ద సినిమాల నుండి చిన్నగా కథల్లోకి తొంగి చూస్తున్నాడు. ఎంత పెద్ద సినిమా చేశామా..? అనేదాని కన్నా ఎంత డిఫెరెంట్ రోల్ చేశామా..? అనే కాన్సెప్ట్ కి ఫిక్సయ్యాడు.

సీత : తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘అమాయక చక్రవర్తి’ లా కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. నిన్న మొన్నటి వరకు మాసివ్ పర్ఫామెన్స్ తో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఈ హీరో, ‘సీత’ లో ఇన్నోసెంట్ గా కనిపించబోతున్నాడు.

రాక్షసుడు సినిమాలో చేసేది పోలీస్ పాత్రే… కానీ కథ ఇంతకు ముందులాగా కమర్షియల్ బేస్డ్ కాదు. అక్కడక్కడా నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తూ, థ్రిల్లింగ్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు ఈ సినిమాలో…

టైగర్ నాగేశ్వర రావు : 1970 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న బయోపిక్ ఇది. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు గా కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. గజదొంగ పాత్రలో కనిపించనున్న ఈ మాస్ హీరో, ఈ సినిమా తన కరియర్ లో స్పెషల్ గా నిలిచిపోతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.