బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం – రిలీజ్ డేట్ కన్ఫమ్

Tuesday,July 17,2018 - 06:53 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.  ఇంటెన్సివ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని జూలై 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మరో 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్ హిట్టయింది. మరోవైపు ‘ఇష్క్ కర్లే’ ప్రోమో సాంగ్ లోని విజువల్స్, దానికి తోడు ఈ సినిమా ట్రైలర్ లో  ఎలివేట్ అవుతున్న  సినిమా స్టాండర్డ్స్, ఆడియెన్స్ లో సినిమా చుట్టూ క్యూరియాసిటీని రేజ్ చేస్తున్నాయి. ఇప్పటికే క్రియేట్ అయిన భారీ బజ్ నడుమ మూవీ మేకర్స్  ‘సాక్ష్యం’ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా కన్ఫం చేయడంతో, మూవీ లవర్స్ కాన్సంట్రేషన్ ‘సాక్ష్యం’ పై ఫిక్సవుతుంది.

‘నేచర్ ఈజ్ ద విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అభిషేక్ నామా ఈ సినిమాని అబిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.