పాటలతో సందడి చేయనున్న 'సాక్ష్యం'

Tuesday,May 15,2018 - 06:59 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ లోనే మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా వస్తోంది ‘సాక్ష్యం’. స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నారు. గ్రాండ్ గా జరగనున్న ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు తాజాగా డేట్ ఫిక్స్ చేశారు.

ఈనెల 26న సాక్ష్యం ఆడియో రిలీజ్ వేడుక అట్టహాసంగా జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. హీరోహీరోయిన్లు సాయిశ్రీనివాస్, పూజా హెగ్డేతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముుఖులు ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా ఎటెండ్  అవుతున్నారు. కలర్ ఫుల్ గా సాగనున్న ఆటపాటతో ఆడియో ఫంక్షన్ మొత్తం ఫుల్ జోష్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

శ్రీవాస్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ కూడా హిట్ అయితే సాక్ష్యం మూవీ టాలీవుడ్ లో హాట్ కేక్ లా మారుతుంది.