సోషల్ మీడియాలో ‘సాక్ష్యం’ సందడి

Friday,July 13,2018 - 03:26 by Z_CLU

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’. ‘ఈ భూమ్మీద జరిగే సంఘటనలకు దృష్టి మాత్రమే సాక్ష్యం కాదు… సృష్టి కూడా..’ అనే థీమ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజు రోజుకి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి, మరీ ముఖ్యంగా సినిమాలోని స్టోరీలైన్ రివీల్ చేస్తూ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో 3 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

రీసెంట్ గ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూనిట్, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. VFX హైలెట్ కానున్న ఈ సినిమా విజువల్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా, సినిమాని తెరకెక్కిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.