బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ లోగో రిలీజయింది

Friday,June 16,2017 - 03:26 by Z_CLU

బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ హడావిడి బిగిన్ అయింది. ఆగష్టు 11 న రిలీజ్ కానున్న ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ అయింది. ‘జయ జానకి నాయక’ టైటిల్ తో టాలీవుడ్ లో సరికొత్త బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 

రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. శరత్ కుమార్, జగపతి బాబు కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాతో బెల్లం కొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోల పక్కన ప్లేస్ దక్కించుకోవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.