బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

Friday,November 09,2018 - 12:50 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా టైటిల్ ఫిక్సయింది. నిన్నా మొన్నటి వరకు ఈ సినిమా టైటిల్ విషయంలో డిఫెరెంట్  స్పెక్యులేషన్స్ ఉన్నా, ఫిల్మ్ మేకర్స్ మాత్రం ‘కవచం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

ఇప్పటికే కంప్లీట్ కమర్షియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఈ సినిమా పోస్టర్ లో స్టైలిష్ పోలీసాఫీసర్ లా మరింత మెస్మరైజ్ చేస్తున్నాడు. రీసెంట్ గా ‘సాక్ష్యం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరైన బెల్లంకొండ శ్రీనివాస్, ఈ సినిమాలో  డిఫెరెంట్  డైమెన్షన్  లో  కనిపించనున్నాడు.

కాజల్ అగర్వాల్, మెహరీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. శ్రీనివాస్ మామిళ్ళ డైరెక్టర్. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్.