బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వ్యూ

Monday,July 23,2018 - 06:11 by Z_CLU

కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ కి నేచర్ ఎలా సాక్ష్యమయింది అనేదే ‘సాక్ష్యం’ సినిమా ప్రధాన కథాంశం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి పాయింట్ తో తెరకెక్కిందని సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

చాలా అరుదు…

మనం కమర్షియల్ సినిమా చేయగలుగుతాం… మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయగలుగుతాం… లేకపోతే ఒక అవుట్ స్టాండింగ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ చేయగలుగుతాం… కానీ ఫస్ట్ టైమ్ ఇవన్నీ కలిసిన పక్కా ప్యాకేజ్ ఫిల్మ్ సాక్ష్యం.

దానికన్నా ముందే…

‘జయ జానకి నాయకా’ సినిమా రిలీజ్ కన్నా ముందే శ్రీవాస్ గారు నాకీ కథ చెప్పారు… కథ చెప్పగానే నాకు నచ్చేసింది. ఇప్పటి వరకు పంచ భూతాలను బేస్ చేసుకుని ఎవరూ సినిమా చేయలేదు.. భవిష్యత్తులో ఇంకెవరైనా చేస్తారేమో కానీ ఇప్పటి వరకు చేయలేదు ఇదే ఫస్ట్ టైమ్.. అందుకే చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా.

చిన్న సినిమా కాదు…

శ్రీవాస్ గారు నా నుండి ఎక్స్ పెక్ట్ చేసింది ఒకటే… అది కమిట్ మెంట్. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందు చాలా వర్కవుట్ చేయాల్సి వచ్చింది. ఇది జస్ట్ చిన్న సినిమా కాదు.. భారీ కాన్వాస్ పై చాలా కష్టపడి చేశాం…

 

 

ఫస్ట్ సాంగ్ స్పెషల్…

ఫ్లై బోర్డింగ్.. స్యాండ్ బోర్డింగ్… డెజర్ట్ బోటింగ్ వంటి వాటిలో 15 రోజులు దుబాయ్ లో ఉండి ట్రైనింగ్ చేశాకే ఈ సాంగ్ ని తెరకెక్కించాం. పిల్లలకు ఈ సాంగ్ చాలా నచ్చుతుంది.

గ్రాఫిక్స్ తక్కువే…

సినిమాలో మ్యాగ్జిమం ఎలిమెంట్స్ ని న్యాచురల్ గా ప్రెజెంట్ చేయడానికే ట్రై చేశాం… చాలా తక్కువ గ్రాఫిక్స్ వాడాం… ఇప్పుడు పొలాచి లో చాలా సినిమాలు షూట్ చేశారు.. కానీ మాకు అక్కడ విండ్ ప్రాపర్టీ… వారణాసి మణికర్ణ  ఘాట్ లో ఫైర్ ఎలిమెంట్ కి ప్రాపర్టీ… బళ్ళారి లో మైనింగ్ ఎపిసోడ్ ప్రాపర్టీ.. అలాగే రాజమండ్రిలో వాటర్ టన్నెల్స్ ప్రాపర్టీ.. ఈ సీక్వెన్స్ క్లైమాక్స్ లో వస్తుంది… ఇలా ప్రతీది డిఫెరెంట్ డైమెన్షన్స్ లో సినిమా తెరకెక్కింది.

రియాలిటీ కోసమే ట్రై చేశాం…

ఏ సీన్ చేసినా రియాలిటీ కోసమే ట్రై చేశాం.. చాలా అవసరం పడితే తప్ప గ్రాఫిక్స్ వాడలేదు. ఒక్కో యాక్షన్ సీన్ 15 రోజులు షూట్ చేశాం.. రియల్ ఇంపాక్ట్ కోసం…

నా గోల్ అదే…

ఈ కుర్రాడి సినిమా వచ్చిందంటే మినిమం ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ అనిపించుకోవాలి అదే నా గోల్… అందుకే చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాను.

చాలా స్టైలిష్….

ప్రతి యాక్షన్ సీక్వెన్స్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. బ్లడ్ ఉండదు… పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు..

నాకు నచ్చిన లుక్…

లుక్స్ విషయానికి వస్తే డైరక్టర్ డెసిషన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో శ్రీవాస్ గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేశారు. సో నాకు నచ్చినట్టు నేను లుక్స్ ప్లాన్ చేసుకున్నా…

మ్యూజిక్ విషయంలో…

ప్రతి సాంగ్ కొత్తగా ఉంటుంది. హర్షవర్ధన్ ప్రతి సాంగ్ ని చాలా బాగా కంపోజ్ చేశాడు. దానికి తగ్గటు లుక్ ఆఫ్ ది ఫిల్మ్ కూడా అద్భుతంగా ఉంటుంది…

పూజా హెగ్డే మంచి ఫ్రెండ్..

పూజా మంచి కో స్టార్… తనని మేం సైన్ చేసినప్పుడు DJ టీజర్ కూడా బయటికి రాలేదు. మా సినిమా కంప్లీట్ అయ్యేసరికి DJ రిలీజయింది. తను పెద్ద స్టార్ అయిపోయింది.

 

తేజ గారి సినిమా…

తేజ గారితో ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. చాలా కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఆయన సినిమాలో. ఈ సినిమా రిలీజ్ తరవాత నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ అవుతుంది.

పోలీసాఫీసర్ గా…

ఇప్పటి వరకు ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ తో పని చేశాను. ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో పని చేస్తున్నాను. నా నెక్స్ట్ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించనున్నాను. ఆగష్టు లో క్లైమాక్స్ సీక్వెన్సెస్ షూట్ చేసి, తక్కిన సాంగ్స్ చేసేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా నవంబర్ లో రిలీజవుతుంది.