సాక్ష్యం కోసం బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ అవతార్

Thursday,July 26,2018 - 11:59 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ క్రియేట్ చేస్తున్న బజ్ చూస్తుంటే, బెల్లంకొండ శ్రీనివాస్ కరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడం ఖాయమనే అనిపిస్తుంది. ‘అల్లుడు శ్రీను’ సినిమాతో కరియర్ ని బిగిన్ చేసి జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటూ మాస్ హీరో అనిపించుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా కోసం చాలా హోమ్ వర్క్ చేశాడు.

యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ 6 ప్యాక్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. ‘సాక్ష్యం’ కోసం ఎక్స్ట్రా ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చిందని చెప్తూ ఈ హీరో ట్వీట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్  చేస్తుంది. సినిమాలోని అగ్రెసివ్ యాక్షన్ సీక్వెన్సెన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫామెన్స్ హైలెట్ కానుంది.

 

పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది. రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమాని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.