కుర్ర హీరో సినిమాకు సెంటిమెంట్

Friday,March 13,2020 - 10:02 by Z_CLU

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి సహజం. నిర్మాతలే కాదు దర్శకులు, హీరోలు కూడా అప్పుడప్పుడు  సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి కూడా తన సినిమా టైటిల్స్ లో ‘అ’ అనే అక్షరాన్ని సెంటిమెంట్ గా వాడుతుంటారు. అయితే ఇప్పుడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ టైటిల్ నే తన నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన సినిమాల్లో రెండే రెండు హిట్స్ ఒకటి ‘అల్లుడు శీను’ కాగా మరొకటి ‘రాక్షసుడు’. ఇప్పుడు తనకి కలిసొచ్చిన మొదటి సినిమా టైటిల్ లో అల్లుడు పదాన్ని వాడుతూ ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ ను పెట్టుకున్నాడు. నిజానికి ఇందులో మరో సెంటిమెంట్ కూడా ఉంది. ‘అదుర్స్’ టైటిల్ తో ఎన్టీఆర్ ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కూడా. ఆ లెక్కన చూసినా ఈ టైటిల్ కి రెండు విధాల సెంటిమెంట్స్ ఉన్నాయి.

మరి ఈ సెంటిమెంట్ టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ అనిపించి హిట్ కొడతాడా చూడాలి.