Prabhas-Bellamkonda - సర్ ప్రైజ్ కాంబో!

Thursday,November 12,2020 - 12:14 by Z_CLU

Bellamkonda Srinivas బాలీవుడ్ ఎంట్రీ ఫిక్సయింది. త్వరలోనే ఓ రీమేక్ తో నార్త్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. అయితే తన హిందీ డెబ్యూ కోసం బెల్లంకొండ ఎంచుకున్న రీమేక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం Prabhas-Rajamouli కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఛత్రపతి సినిమాను హిందీలో చేయబోతున్నాడు శ్రీనివాస్.

‘ఛత్రపతి’ లో ప్రభాస్ చేసిన శివాజీ రోల్ సినిమాను నిలబెట్టి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా రాజమౌళి స్క్రీన్ ప్లే , ప్రభాస్ హీరోయిజానికి అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరి ఈ బ్లాక్ బస్టర్ ను రీమేక్ చేయబోతున్న శ్రీనివాస్… ప్రభాస్ ని మ్యాచ్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడతాడా చూడాలి.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఎవరు… నిర్మాణ సంస్థ వివరాలు తెలియాల్సి ఉంది.

Also Check – మారుతి దర్శకత్వంలో…