సెట్స్ పైకొచ్చిన బెల్లంకొండ కొత్త సినిమా

Friday,March 02,2018 - 06:01 by Z_CLU

ఈమధ్యే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. శ్రీనివాస్ అనే కొత్త వ్యక్తి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది ఈ కొత్త సినిమా. లవ్ తో పాటు యాక్షన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. ఈ మేరకు సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

రీసెంట్ గా సాక్ష్యం సినిమాను పూర్తిచేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మే 11న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించాడు.