బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూ

Thursday,August 01,2019 - 04:06 by Z_CLU

ఇటివలే ‘సీత’ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు ‘రాక్షసుడు’ సినిమాతో రాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపే గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించాడు ఆ విశేషాలు శ్రీనివాస్ మాటల్లోనే…

 

కథే హైలైట్

తమిళ్ లో ‘రాట్ససన్’ సినిమా చూసాను. చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్ గా సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా. కథే హైలైట్ గా ఉంటుంది. తెలుగులో ఈ సినిమా చేస్తే బాగుంటుందనుకున్నాను. అప్పట్లో రీమేక్ రైట్స్ కోసం రెండు నెలలు గట్టిగా ట్రై చేసాం. ఎట్టకేలకు ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో చేసినందుకు హ్యాపీ గా ఉంది.

 

ఊహే తట్టుకోలేకపోయాను

సినిమా స్టార్ట్ చేసాక… కథలో ఉన్న ఇన్సిడెంట్స్ కొన్ని రియల్ గా జరిగాయి. షూట్ జరుగుతున్నప్పుడు అవి చూసి మూడ్ ఆఫ్ అయిపొయింది. మిగతా సినిమాలు చేసినట్టు ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ చేయలేకపోయాను. కారణం సినిమాలో ఉన్న కంటెంట్ అలాగే బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా కజిన్స్ చిన్నప్పుడు నా చేతిలో పెరిగారు. ఆ పాపలకి ఇలా జరిగితే..? అన్న ఊహే తట్టుకోలేకపోయాను.


రియలిస్టిక్ కాప్ గా …

‘కవచం’లో పోలీస్ క్యారెక్టర్ చేసాను కానీ ఈసారి రియలిస్టిక్ కాప్ గా నటించాను. కమర్షియల్ ఎలివేషన్స్ లాంటివేం ఉండవు. ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ లాగే కనిపిస్తాను. క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ తీసుకొని చేసాను.

తెలుగులో ఇంకా బాగుంటుంది

పెర్ఫార్మెన్స్ బట్టి తమిళ్ వర్షన్ కంటే తెలుగు వర్షన్ ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే అందరూ ఇంకా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాం. క్యారెక్టర్స్ అన్ని బాగా కనెక్ట్ అవుతాయి.

ఆ సినిమాను పట్టించుకోకుండా

ఒరిజినల్ సినిమాను ఒకేసారి మాత్రమే చూసాను. ఈ సినిమా జరిగేటప్పుడే ఆ సినిమా గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఫ్రెష్ మైండ్ తో చేసాను. నిజంగా చెప్పాలంటే ఆ సినిమాను పట్టించుకోకుండా ఒక ఫ్రెష్ సినిమాల ఫీలయ్యి నటించాను. మన మైండ్ లో రీమేక్ అనే ఫీలింగ్ ఎక్కువగా రానివ్వకూడదు. అప్పుడే మనం బెస్ట్ ఇవ్వగలం అని నమ్ముతాను.


థ్రిల్లింగ్ గా ఉంటుంది

సినిమా అంతా ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తిగా సాగుతుంది. సైకో ని పట్టుకోవాలని ఎన్ని సార్లు ట్రై చేసినా వాడు ఎస్కేప్ అవుతుంటాడు. ఆ సీన్స్ ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేస్తాయి. క్లైమాక్స్ వరకూ సినిమా ఎవరి ఊహకు అందదు.

నా రిక్వెస్ట్ అదొక్కటే

ఈ సినిమాను రీమేక్ సినిమాలా కాకుండా ఓ ఫ్రెష్ సినిమాల చూడాలి. ఈ సినిమా చూసే ముందు తమిళ్ సినిమా చూడకపోతే బెటర్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

ఉన్నది ఉన్నట్టుగా 

సినిమాలో కంటెంట్ ఏ మాత్రం మార్చకుండానే తీశాం. నిజానికి మార్చడానికి ఏం లేదు. కంటెంట్ అలాంటిది మార్పులు చేస్తే ఇంపాక్ట్ ఉండదు. అందుకే చేంజెస్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా  తెరకెక్కించాం.


బ్రేక్ తీసుకోకుండా

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా 85 రోజులు నాన్ స్టాప్ గా వర్క్ చేసాను. ఆదివారం కూడా షూటింగ్ చేసేవాళ్ళం. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది చాలెంజింగ్ గా చేయాలన్న ఉద్దేశ్యంతో ఎక్కువ కష్టపడ్డాను.

90 శాతం సులువు… కానీ

రీమేక్ అనేది 90 శాతం సులువే. కాని 10 శాతం ఒత్తిడి ఉంటుంది. ఆ రేంజ్ కి వెళ్తుందా..? లేదా ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద టాస్క్. అదొక్కటి మినహాయిస్తే నా దృష్టిలో రీమేక్ కష్టమేమి కాదు.

నా ఉద్దేశ్యం అదే

ఇండస్ట్రీ కొచ్చి ఐదేళ్ళయింది. కొన్ని హిట్స్ ఉన్నాయి ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ కంటెంట్ పరంగా ఇలాంటి సినిమా రాలేదు. కథ నచ్చి నటుడిగా సరెండర్ అయిపోయి చేసాను. అందుకే ఇది నా మొదటి సినిమా అనుకుంటున్నాని చెప్పాను. ఇప్పటి నుండి మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేయాలనుకుంటున్నాను. ఇకపై కథలపై ఎక్కువ ఫోకస్ పెడతాను.

నెల రోజులు టూర్

లాస్ట్ జులైలో సాక్ష్యం రిలీజయింది. ఆ జులై నుండి ఈ జులై వరకూ మూడు సినిమాలు రిలీజ్ చేసాను. ఆడియన్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసాను. ఇప్పుడు ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని అమెరికా టూర్ వెళ్ళబోతున్నాను.