Stuartpuram Donga - బెల్లంకొండ కొత్త సినిమా!

Wednesday,August 11,2021 - 03:54 by Z_CLU

రాక్షసుడు’ తో మంచి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ ఆ సినిమా తర్వాత జెట్ స్పీడులో సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం వినాయక్ డైరెక్షన్ లో ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తున్న శ్రీనివాస్ ఇటివలే ‘కర్ణన్’ రీమేక్ కూడా ఎనౌన్స్ చేశాడు. తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచేసి ఇంకో ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ‘స్టువర్ట్ పురం దొంగ’ అనే టైటిల్ సినిమా చేయబోతున్నాడు.

ఈరోజు టైటిల్ పోస్టర్ తో సినిమాను ఎనౌన్స్ చేసి డీటెయిల్స్ ఇచ్చారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సొంత బేనర్ లో తండ్రి నిర్మాణంలో చేయబోతున్నాడు శ్రీనివాస్. ఈ సినిమాతో వినాయక్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన KS దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. అయితే గతంలో వంశీకృష్ణ అనే దర్శకుడు టైగర్ నాగేశ్వరరావు కథతో సినిమా చేయాలని చూశాడు.

Bellamkonda Sai Sreenivas Stuartpuram Donga movie 1

ఆ ప్రాజెక్ట్ కి రానా, రవితేజ పేర్లు కూడా వినిపించాయి. మరి సడెన్ గా ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయడం హాట్ టాపిక్ అవుతుంది. టైగర్ నాగేశ్వరరావు కథని ఈ దర్శకులిద్దరు రెండు వర్షన్స్ రాసుకున్నారేమో. ఆ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పస్తుతం స్క్రిప్ట్ లాకైన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.

bellamkonda bollywood debut chatrapathi remake

నాగేశ్వ‌ర‌రావు త‌న జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా త‌ప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వ‌ర‌రావు త‌ప్పించుకున్న తీరుతో ఆయ‌న‌కు `టైగ‌ర్‌` అనే పేరు వ‌చ్చింది. పోలీసుల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మ‌ర‌ణించాడు. ఈ విష‌యాల‌తో  `స్టూవ‌ర్టుపురం దొంగ‌` సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics