సోషల్ మీడియాలో ‘సాక్ష్యం’ ఇంపాక్ట్

Monday,July 09,2018 - 05:35 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన బెల్లంకొండ ‘సాక్ష్యం’ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. దానికి తోడు ఈ సినిమా స్టోరీని రివీల్ చేస్తూ రిలీజైన ట్రైలర్ జస్ట్ 2 రోజుల్లో 2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి, యూ ట్యూబ్ లో నంబర్ 1 ప్లేస్  లో  ట్రెండ్ అవుతుంది.

భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ హైలెట్ కానున్నాయి. అటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు, ఇంట్రెస్టింగ్ రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ చూస్తుంటే, బెల్లంకొండ శ్రీనివాస్ కరియర్ లో ఈ సినిమా స్పెషల్ స్పేస్ ఆక్యుపై చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.

శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. హర్షవర్ధన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.