హీరోయిన్లను రిపీట్ చేస్తున్న బెల్లంకొండ

Friday,February 15,2019 - 12:18 by Z_CLU

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంతమంది క్రేజీ హీరోయిన్లతో యాక్ట్ చేశామన్నది ముఖ్యం. బెల్లంకొండ ఫార్ములా ఇదే. స్టోరీలైన్ ఏదైనా, డైరక్టర్ ఎవరైనా ఆ ప్రాజెక్టులో క్రేజీ హీరోయిన్ ఉండాల్సిందే. అందుకే రకుల్ ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు.

తమిళ్ లో హిట్ అయిన రాట్ససన్ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు ఈ హీరో. ఇందులో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో ఈమెతో జయజానకి నాయక సినిమా చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్.

రకుల్ ను మాత్రమే కాదు, సమంతను కూడా ఇలానే రిపీట్ చేయబోతున్నాడు. ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు బెల్లంకొండ. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకునే ప్లాన్స్ లో ఉన్నారు. గతంలో సమంతతో కలిసి అల్లుడు శీను సినిమా చేశాడు ఈ హీరో.

రకుల్, సమంత కంటే ముందే కాజల్ ను రిపీట్ చేశాడు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మతో కలిసి కవచం సినిమా చేసిన బెల్లంకొండ, ప్రస్తుతం సీత అనే ప్రాజెక్టులో ఆమెతో కలిసి నటిస్తున్నాడు. ఇదే స్పీడ్ లో త్వరలోనే పూజా హెగ్డేను కూడా రిపీట్ చేస్తాడేమో చూడాలి.