మరో సినిమా ఎనౌన్స్ చేసిన బెల్లంకొండ

Thursday,January 03,2019 - 11:49 by Z_CLU

ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈ సందర్భంగా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు ఈ హీరో. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. గతంలో వీర, ఒక ఊరిలో, రైడ్ లాంటి సినిమాలు తీశాడు ఈ దర్శకుడు.

కొత్త సినిమా కోసం బెల్లంకొండ మేకోవర్ కూడా అయ్యాడు. ఇప్పటివరకు తన ప్రతి సినిమాలో క్లీన్ షేవ్ తో కనిపించిన ఈ హీరో, కొత్త సినిమా కోసం ఫుల్ గా గడ్డంపెంచాడు. రఫ్ లుక్ లోకి మారాడు. A-స్టుడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించనున్నాడు. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనే విషయాన్ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ. కాజల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్ పైకి వస్తుంది.