Bellamkonda - డెబ్యూ ఇవ్వకుండానే రెండో సినిమా రెడీ

Tuesday,September 13,2022 - 01:48 by Z_CLU

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి రెండో హీరోగా పరిచయమౌతున్నాడు గణేశ్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన స్వాతిముత్యం సినిమాతో ఇతడు హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా విడుదలకాకముందే, ఈ హీరో ఇంకో సినిమాను కూడా రెడీ చేశాడు. ఆ మూవీ పేరు, ఫస్ట్ లుక్ తో పాటు టోటల్ డీటెయిల్స్ బయటకొచ్చాయి.

‘స్వాతిముత్యం’ సినిమాతో అరంగేట్రం చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాని SV2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో చేస్తున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘నాంది’ సినిమా తర్వాత ఈ బ్యానర్ నుండి వస్తున్న సినిమా ఇది. సతీష్ వర్మ నిర్మాత. దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరో దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాకు కథ అందించాడు.

ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మంచి థ్రిల్లర్‌గా రాబోతోంది. తాజాగా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నేను స్టూడెంట్ సర్! ‘ టైటిల్ ఖరారు చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గాయపడిన గణేష్ తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ని చూపుతుండగా అతని చుట్టూ తుపాకులు గురిపెట్టడం ఇంట్రస్టింగ్ గా ఉంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నాడు.

సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు. స్వాతిముత్యం రిలీజ్ తర్వాతే ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది.

bellamkonda nenu student sir