ఫైనల్ స్టేజ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం

Monday,April 09,2018 - 05:39 by Z_CLU

ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’. 15 రోజుల పాటు జరిగే ఈ రెగ్యులర్ షూటింగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఉండబోయే కీలక సన్నివేశాలతో పాటు, మరో పాటను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

న్యూయార్క్, గ్రాండ్ కాన్యాన్ తో పాటు న్యూజెర్సీ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్ లలో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సాక్ష్యంలో జగపతిబాబు, రావు రమేష్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

హర్షవర్ధన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది.