RadheShyam - రొమాంటిక్ మోషన్ పోస్టర్

Friday,October 23,2020 - 05:22 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ పీరియాడిక్ మూవీ.. రొమాంటిక్ ఎలిమెంట్స్ తో వస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టే రొమాంటిక్ లుక్ లో, రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో వచ్చింది రాధేశ్యామ్ మోషన్ పోస్టర్. దీనికి బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అందమైన ప్రేమకథ రాధేశ్యామ్. ఈ ప్రేమకథకు ఇండియాతో కనెక్షన్ ఏంటి.. ఇద్దరు ప్రేమికుల మధ్య విధి ఎలాంటి విచిత్రం చేసింది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో వస్తోంది  ఈ సినిమా.

మోషన్ పోస్టర్ లో ప్రభాస్-పూజాహెగ్డే పెయిర్ అదిరిపోయింది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో ఓ స్టిల్ విడుదల కాగా.. మోషన్ పోస్టర్ లో భాగంగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ తో రాధేశ్యామ్ పై అంచనాలు మరింత పెరిగాయి.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో పూజాహెగ్డే కనిపించనుంది. ఇక ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య.