BBC ఇంటర్వ్యూ - అనుష్క

Wednesday,May 03,2017 - 09:03 by Z_CLU

బాహుబలి ప్రమోషన్స్ లో భాగంగా BBC ఫేస్ బుక్ Live లో తమ ఎక్స్ పీరియన్సెస్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఎగ్జైటెడ్ గా మాట్లాడింది అనుష్క.

ప్రభాస్ తో ఇంకా సినిమాలు చేస్తారా..?

తప్పకుండా… ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉంటా.

ప్రస్తుతం ఏయే సినిమాలు చూస్తున్నారు..? బాహుబలి తరవాత ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి..?

ప్రస్తుతానికి కొత్త వెంచర్స్ అయితే ఏవీ సంతకం లేదు, భాగమతి ఆల్ రెడీ సెట్స్ పై ఉంది. డెఫ్ఫినేట్ గా బాహుబలి నా కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఇందులో అనుమానం లేదు.

జస్ట్ సౌత్ సినిమాకే పరిమితమయ్యారు..? ఎపుడైనా ఈ విషయంలో బాధపడ్డారా..?

ఎప్పుడూ లేదు… సౌత్ ఇండియన్ సినిమా బాలీవుడ్ నినిమా… అని నా దృష్టిలో ప్రత్యేకమైన ఆలోచన లేదు.  సినిమా చేయాలంటే ఇన్స్పైర్ చేయాల్సింది కథ, అందులో మన క్యారెక్టర్, డైరెక్టర్. నేను చూసేవి ఇవి మూడే. స్టోరీ కి జియోగ్రాఫికల్ బ్యారియర్స్ ఉండవు. ఆ విషయం బాహుబలి ప్రూఫ్ చేసింది.

సీనియర్స్ ఇప్పటి జెనెరేషన్  కి షో లే సినిమా గొప్పతనం గురించి చెప్తుంటారు..? అందులో హేమామాలిని ని మీతో పోలుస్తున్నారు.? ఎలా ఆనిపిస్తుంది..?

చాలా హ్యాప్పీగా అనిపిస్తుంది. మేము కూడా మా గ్రాండ్ చిల్డ్రన్ కి బాహుబలి గురించి చెప్పాలి.. బాహుబలి డిజర్వ్స్ ఇట్.

ఆడియెన్స్ గా చూస్తే స్క్రీన్ పై దేవసేనను చూస్తే ఏమనిపిస్తుంది…?

ఆక్చువల్ గా నటిగా నా కరియర్ మొదలుపెట్టినప్పటి నుండి నా సినిమాలలో ఆడియెన్స్ లా ఫీల్ అవుతూ చూసిన బాహుబలి ఒకటే. ఈ సినిమాలో నేను అసలు నాకు కనబడనే లేదు. దేవసేన కనిపించింది. డెఫ్ఫినేట్ గా ఆ క్రెడిట్ రమా రాజమౌళి గారికి ప్రశాంతి గారికే దక్కుతుంది. ఎందుకంటే క్యారెక్టర్ కన్నా ముందు లుక్స్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తాయి.ఈ విషయంలో నేనెప్పుడూ వాళ్లకు రుణపడి ఉంటాను.

సౌత్ ఇండియన్ సినిమాలో మీకు నచ్చిన డైరెక్టర్..?

డెఫ్ఫినేట్ గా రాజమౌళి గారు. ఆయనతో పాటు మణిరత్నం గారు, బాపుగారు, విశ్వనాథ్ గారు… అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ మణిరత్నం గారి డైరెక్షన్ లో నటించాలన్నది స్ట్రాంగెస్ట్ డిజైర్.

ఫ్యాన్స్ తో ఏమైనా చెప్పదలుచుకున్నారా…?

చాలా ఉంది. వాళ్ళ సపోర్ట్ లేకపోతే బాహుబలి ఈ రేంజ్ లో రీచ్ అయ్యేది కాదు. ఫ్యాన్స్ కే కాసు బాహుబలి కోసం పని చేసిన చాలా మందికి పెద్ద థాంక్స్. మీ సపోర్ట్ బాహుబలి ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్ అయి ఉండేది. థాంక్ యూ సో మచ్.