Battala Ramaswamy Biopikku - ట్రయిలర్ రివ్యూ

Tuesday,May 11,2021 - 06:48 by Z_CLU

‘తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బ్రతుకూ ఒక బయోపిక్కే’ డైలాగ్‌తో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ టీజర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడా అంచనాల్ని డబుల్ చేస్తూ Battala Ramaswamy Biopikku ట్రయిలర్ రిలీజైంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అనిపించేలా ఉంది ఈ మూవీ ట్రయిలర్.

మూవీలో ఆర్టిస్టులంతా కొత్త వాళ్లు. ఎవ్వరికీ స్టార్ డమ్ లేదు. అయినప్పటికీ ట్రయిలర్ చూస్తున్నంత సేపు కొత్త నటీనటులనే ఫీలింగ్ రాదు. అంతలా ఆడియన్స్ కు కనెక్ట్ అయింది బట్టల రామస్వామి బయోపిక్కు ట్రయిలర్. అటుఇటుగా 100 సెకెన్ల నిడివి ఉన్న ఈ ట్రయిలర్ సరదాగా సాగిపోయింది.

ట్రయిలర్ చూస్తుంటే.. రామస్వామి బట్టల వ్యాపారం చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చీరల వ్యాపారం చక్కగా చేసుకోవడంతో పాటు.. తను కోరుకున్నట్టుగా వీధుల్లో నగలు అమ్మే జయప్రదను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.. అయితే, అనుకోని పరిస్థితుల్లో మరో ఇద్దరి మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ను సరదాగా చూపించబోతోంది ఈ సినిమా.

అల్తాఫ్ హసన్ ఎక్స్ ప్రెషన్స్ ట్రయిలర్ లో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవగా.. భద్రం ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ట్రయిలర్ లో కామెడీని మరింత ఎలివేట్ చేసింది.

ఈ శుక్రవారం (మే 14న) ZEE5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది బట్టల రామస్వామి బయోపిక్కు. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా అందర్నీ ఎంతగానో నవ్వించడం గ్యారెంటీ. రామ్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకుడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics