'బంగారు బుల్లోడు' ట్రైలర్ రివ్యూ

Tuesday,January 19,2021 - 05:09 by Z_CLU

అల్లరి నరేష్ హీరోగా నటించిన బంగారు బుల్లోడు ఎట్టకేలకు ఈ నెల 23న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. సినిమాలో ఉన్న ఎంటర్టైన్ మెంట్ ఎలిమెంట్స్ తెలియజేసేలా 1నిమిషం 50 సెకన్ల నిడివితో ట్రైలర్ ను కట్ చేశారు.

“కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టేవాడు ఒక్కడు కూడా కనబడటం లేదు” అంటూ పృథ్వీ డైలాగ్ తో స్టార్టయిన ట్రైలర్ “పులిహోరా..? అది పారడైజ్ బిర్యానీ విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్” అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్ తో ఎండ్ అయింది. ట్రైలర్ లో అల్లరి నరేష్ కామెడీ పంచులు, కామెడీయన్స్ కామెడీ సీన్స్ , పూజా జావేరి గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. సినిమాలో గోల్డ్ స్కాం మీద సీరియస్ ఎలిమెంట్ కూడా ఉందని చెప్పేలా ట్రైలర్ చివర్లో పోలీస్ ఇంటరాగేషన్ సన్నివేశాలు జత చేసారు.

ట్రైలర్ లో సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. అలాగే సతీష్ ముత్యాల  సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. దర్శకుడు గిరి ఒక మంచి ఎంటర్టైనర్ సినిమాను ప్రేక్షకులకు అందివ్వనున్నాడని ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చాడు.  ట్రైలర్ లో వెలిగొండ శ్రీనివాస్ డైలాగ్స్ కూడా ఆకట్టుకొని అలరించాయి.  ఓవరాల్ గా విలేజ్ ఫన్ ఎంటర్టైనర్ కథతో వస్తున్న ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్ సినిమాలో ఉన్న ఫన్ ఎలిమెంట్స్ తెలియజేస్తూ మళ్ళీ ఒకప్పటి అల్లరి నరేష్ కామెడీ సినిమాలను ప్రేక్షకులను గుర్తు చేసింది. మరి జనవరి 23న ఈ సినిమాతో అల్లరోడు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.